: సోనియా, రాహుల్ లకు బెయిల్ ఇవ్వొద్దని కోరతా: సుబ్రహ్మణ్య స్వామి


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె పుత్రరత్నం రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరు చేయరాదని కోర్టును కోరనున్నట్లు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. తల్లీకొడుకులిద్దరూ వచ్చే నెల 7న పాటియాలా కోర్టులో జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదివారం వ్యాఖ్యానించిన ఆయన, వారిద్దరికీ బెయిల్ ఇవ్వాల్సి వస్తే, వారి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్న తరువాతే బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విన్నవించనున్నట్లు చెప్పారు. 2జీ కుంభకోణంలో రాజా మాదిరే చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ కూడా జైలుకు వెళ్లనున్నారన్నారన్నారు. అయితే సోనియా, చిదంబరంలలో ఎవరు ముందు జైలుకు వెళతారనే విషయం మాత్రమే తేలాల్సి ఉందన్న ఆయన, ఇరు కుటుంబాలు కటకటాలపాలయ్యే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయన్నారు.

  • Loading...

More Telugu News