: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను ఆదివారం చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని ఏర్పేడు మండలం కొత్తవీరపురంలో దాడులు నిర్వహించిన పోలీసులు, ఓ లారీలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారు తరలిస్తున్న రూ. 50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.