: చివరికి న్యాయమే గెలిచింది: అంబటి


నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో న్యాయమే గెలిచిందని వైెఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆదివారం లాటరీ పద్ధతిన జరిగిన ఎన్నికలో రెండు పదవులు వైఎస్సార్సీపీకి దక్కిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత అంబటి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో 31 స్థానాలను గెలుచుకున్న తమ పార్టీ, పూర్తి మెజార్టీ సాధించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే అధికార పక్షం కుట్రలు పన్ని జడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు యత్నించిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే తమ పార్టీ తరఫున గెలిచిన ఎనిమిది మంది జడ్పీటీసీలను తమవైపు తిప్పుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. అయితే అనేక ఊహించని పరిణామాల మధ్య జరిగిన ఎన్నికలో గెలుపు తమనే వరించిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చిన టీడీపీకి తగిన గుణపాఠం నేర్పినట్లైందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News