: బియాస్ నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యం
బియాస్ నది దుర్ఘటనకు సంబంధించి ఆదివారం మరో ఇద్దరు విద్యార్థినీల మృతదేహాలు లభ్యమయ్యాయి. తాజాగా లభ్యమైన మృతదేహాల్లో ఒకటి కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి దిగా గుర్తించగా, మరో మృతదేహం రిషితా రెడ్డిదిగా అధికారులు గుర్తించారు.