: తెరాస శ్రేణులు, ఓయూ విద్యార్థుల మధ్య వాగ్వాదం


కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి ఆదివారం తెరాస శ్రేణులు, ఉస్మానియా విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నగరంలోని సిటీ కళాశాల వద్ద తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలను ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెరాస శ్రేణులు విద్యార్థుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమాలోచనలు చేస్తున్నట్లు మంత్రులు చెప్పినప్పటికీ, అక్కడికక్కడే ఏదో ఒకటి చెప్పాలంటూ విద్యార్థులు ఒత్తిడి తెచ్చారు. దీంతో మంత్రుల వెంట ఉన్న తెరాస శ్రేణులు విద్యార్థులను నెట్టివేసే యత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News