: 2020 నాటికి ఏపీలో విద్యుత్ కోతలుండవు: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలో జరిగిన పార్టీ సీమ నేతల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 నాటికి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలకు గత యూపీఏ సర్కారు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలే కారణమని ఆరోపించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ను త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.