: బీహార్ పై గురిపెట్టిన బీజేపీ
లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో... బలం లేని రాష్ట్రాల్లో కూడా పుంజుకునేందుకు బీజేపీ కసరత్తులు మొదలు పెట్టింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న బీహార్ పై బీజేపీ గురిపెట్టింది. ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధనే లక్ష్యంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేలే అవసరమైనప్పటికీ... 175 సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 40 లోక్ సభ స్థానాలకు గాను 22 సీట్లను బీజేపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదే ఊపులో బీహార్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది.