: ప్రధాని విమానంపైకి క్షిపణి ప్రయోగించినా ఏమీ కాదు... ఎందుకంటే...!
బ్రిక్స్ సమావేశాల అనంతరం భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న ఎయిరిండియా-వన్ విమానం ఉక్రెయిన్ గగనతలం మీదే... మలేసియా విమానం ప్రయాణించిన మార్గంలోనే వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో, ఈ ప్రయాణం ఒక్కసారిగా చర్చల్లో నిలిచింది. మలేసియా విమానంపై దాడిచేసిన దుండగులు ప్రధాని విమానంపై క్షిపణి ప్రయోగించి ఉంటే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న అందర్లోనూ కలుగుతోంది. అయితే, దీనికి ఒకటే ఆన్సర్. అది ఏమిటంటే... ఏమీ కాదని! అవును, క్షిపణి ప్రయోగించినా ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా-వన్ విమానానికి ఏమీ కాదు. ఎందుకంటే, ఈ విమానంలో రూ. 200 కోట్ల ఖర్చుతో క్షిపణి దాడులను పసిగట్టి వాటిని దారిమళ్లించే ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజరర్స్ (ఈసీఎమ్) వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయోగ స్థావరం నుంచి క్షిపణిని ప్రయోగించగానే... విమానంలోని రాడార్ దాన్ని పసిగడుతుంది. వెంటనే క్షిపణిని తప్పుదారి పట్టించే సంకేతాలను విడుదల చేస్తుంది. దీంతో, ఎలాంటి క్షిపణి అయినా ఈ విమానాన్ని ఢీకొనలేక పక్కదారి పడుతుంది. సో, మన ప్రధాని సేఫ్!