: ఆర్టీసీ బస్సు ఇంట్లోకి దూసుకెళ్లింది... యజమాని ప్రాణాలు తీసింది
మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. సిద్ధిపేట నుంచి కరీంనగర్ వెళుతున్న గరుడ ఎక్స్ ప్రెస్... ఎదురుగా వస్తున్న ఓ బైక్ ను తప్పించబోయి, పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకుపోయింది. దీంతో ఇంటి యజమాని రాజేశం (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. చిన్నకోడూరు మండలం రామునిపట్లలో ఈ ఘటన చోటు చేసుకుంది.