: పాకాల సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వైకాపా ఎమ్మెల్యే వీరంగం


చిత్తూరు జిల్లాలోని పాకాల సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వీరంగం వేశారు. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో ఆలయ ఛైర్మన్ ఆనందచౌదరితో గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో, ఆనందచౌదరి, చెవిరెడ్డి వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం, నిబంధనల ప్రకారం ఆలయ ఛైర్మన్ చౌదరి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. దీంతో, స్వామికి రెండోసారి పట్టు వస్త్రాలు సమర్పించడానికి చెవిరెడ్డి సిద్ధమయ్యారు. రెండోసారి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయతీకి విరుద్ధం.

  • Loading...

More Telugu News