: తెలంగాణ స్టాంపుల చట్టాన్ని తెచ్చేందుకు టీ సర్కార్ యత్నం


120 ఏళ్ల నాటి ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ ను పూర్తిగా మార్చివేసి... తెలంగాణ స్టాంప్స్ యాక్ట్ ను తెచ్చేందుకు టీ సర్కార్ యత్నిస్తోంది. తెలంగాణలో తెలంగాణ చట్టాలే ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చట్టంలో మార్పుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ మొదలుపెట్టింది. స్టాంపు డ్యూటీ పూర్తిగా రాష్ట్రాలకు చెందిన అంశమే కావడంతో... సొంత చట్టాలను తయారుచేసుకుని కేంద్రం అనుమతి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే దీనికోసం ముగ్గురు అధికారులతో ఓ కమిటీని కూడా వేసింది. కమిటీలో హైదరాబాద్, కరీంనగర్ రిజిస్ట్రేషన్ విభాగాల డీఐజీలు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ఉన్నారు.

  • Loading...

More Telugu News