: అనుష్కపై మోజే కోహ్లీ కొంప ముంచుతోందా?
టీమిండియా యువసంచలనం విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు భారత జట్టు ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుత ఇంగ్లండ్ టూర్ లో విరాట్ పై భారత అభిమానులు భారీ అంచనాలే పెట్టకున్నారు. అయితే ఈ ఢిల్లీ స్టార్ బ్యాట్స్ మన్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటికి మూడు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ... ఒక్క ఇన్నింగ్స్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. తొలిటెస్టులో 1, 8 పరుగులు... రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో గోల్డెన్ డక్ (పరుగులేమీ చేయకుండా మొదటి బంతికే ఔట్) ఇదీ కోహ్లీ ప్రదర్శన. అయితే కోహ్లీ వైఫల్యానికి బాలీవుడ్ భామ అనుష్క శర్మే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు లండన్ లోనే ఉందట. టీమిండియా బస చేసిన హోటల్లోనే మకాం వేసిందట. ఆట అయిపోవడం ఆలస్యం మన హీరో తన ప్రియురాలు ముందు వాలిపోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లో మనోడు బ్యాంటింగ్ ఏం చేస్తాడులే అని తోటి క్రికెటర్లే గుసగుసలు పోతున్నారు. గతంలో కూడా టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు అనుష్క పనిగట్టుకుని అక్కడకు వెళ్లింది. ఒకానొక సమయంలో అనుష్క షూటింగ్ కోసం శ్రీలంకలో ఉండగా... కోహ్లీ రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోయాడు. వీళ్లు పీకల్లోతు ప్రేమలో మునిగినంత మాత్రాన మనకొచ్చిన సమస్యేమీ లేదు... అయితే, వీరి రొమాన్స్ మన జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపుతుండటమే ట్విస్ట్. ఇకనైనా కోహ్లీ 'అసలైన బ్యాటింగ్'పై దృష్టి సారిస్తేనే టీమిండియాకు బెస్ట్.