: కృష్ణా డెల్టాకు నేటి నుంచి సాగర్ నీరు


కృష్ణా డెల్టా, ఏఎంఆర్పీలకు నేటి నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిన్న జరిగిన సమావేశంలో ఏపీ ఇంజినీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఇంజినీర్-ఇన్-చీఫ్ మురళీధర్ నిర్ణయించారు. కృష్ణా డెల్టాకు విడుదల చేయాల్సిన 10 టీఎంసీల్లో ఇప్పటికే 7.2 టీఎంసీలను విడుదల చేసిన నేపథ్యంలో, మిగిలిన 2.8 టీఎంసీలను పది రోజుల్లో విడుదల చేస్తారు. అలాగే, తెలంగాణలోని నల్లగొండ జిల్లా ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం 20 రోజుల్లో 3 టీఎంసీల నీటిని విడుదల చేస్తారు.

  • Loading...

More Telugu News