: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాటలోనే తెలంగాణ ప్రభుత్వం!
నడుస్తోంది. రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోటయ్య కమిటీ వేసి రుణమాఫీపై అధ్యయనం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రైతుల బ్యాంకు అప్పులపై ఆరా తీయడంలో మునిగిన కోటయ్య కమిటీ నివేదిక ఇంకా ప్రభుత్వానికి సమర్పించలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ తదితరులను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ రైతు రుణాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదిక అనంతరం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. నువ్వెంత? అంటే నువ్వెంత? అనుకునేలా వ్యవహరించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రుణమాఫీపై మాత్రం ఒకే దారిలో నడుస్తున్నాయి.