: వీహెచ్ కు పొన్నాల హెచ్చరిక


టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మధ్య వివాదం రాజుకుంది. టీపీసీసీ చీఫ్ గా తనను తప్పిస్తున్నారంటూ వీహెచ్ వ్యాఖ్యానించడంపై పొన్నాల తీవ్రంగా స్పందించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పార్టీ అంతర్గత విషయాలు బహిరంగ పరచకూడదని, అలా చేస్తే ఎంతటి వారిపైనైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. వీహెచ్ ఎక్కడ మాట్లాడాలో అక్కడే తన అభిప్రాయం చెప్పాలని, మీడియా ముందు మాట్లాడడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 21 నుంచి 31 వరకు నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తామని, త్వరలో మండల స్థాయి సమీక్షలు జరుపుతామని పొన్నాల వెల్లడించారు.

  • Loading...

More Telugu News