: కేసీఆర్, బాబు ఘర్షణ వైఖరితో ఉన్నారు: కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘర్షణ వైఖరి అవలంబిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇద్దరు ముఖ్యమంత్రులు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణకు నిధులు, వసతుల కేటాయింపుపై అమిత్ షాకు వినతిపత్రాలు అందజేశామన్నారు. తెలంగాణకు ఎయిమ్స్ ఆసుపత్రి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నేటి వరకు రుణమాఫీపై స్పష్టతనివ్వలేదని, ఈ కారణంగా బ్యాంకులు రైతులకు రుణాలివ్వడం లేదని ఆయన విమర్శించారు.