: తెలంగాణ ప్రభుత్వానికి కోదండరాం ప్రశంస


తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ నిర్ణయాలు అభినందనీయమన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలున్నాయని పొగిడారు. అయితే, ప్రభుత్వ ఫలాలు స్థానికులకే దక్కాలన్న ఆలోచనలో తప్పులేదన్న కోదండరాం, మార్గదర్శకాలు రూపొందించడంలో విద్యార్థుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని కోరారు. దానిపై విద్యార్థుల నుంచి సూచనలు వస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన, పోలవరం ముంపు గ్రామాల విలీనంపై కాంగ్రెస్, కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించాయని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News