: ఆటోలు, ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు చేయనున్నాం: కేటీఆర్


ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటోలు, ట్రాక్టర్లపై రవాణా పన్నును రద్దు చేయనున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో లక్షలాదిమందికి లబ్ధి కలుగుతుందని చెప్పారు. అలాగే, మైనారిటీలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా బొప్పారం గ్రామంలో ఏర్పాటు చేసిన మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News