: 15 మంది జడ్పీటీసీ సభ్యులను బహిష్కరించిన తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణలో జరిగిన జిల్లాపరిషత్ పరోక్ష ఎన్నికల్లో పార్టీ విప్ ఉల్లంఘించిన 15 మంది జడ్పీ సభ్యులపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చర్యలు తీసుకుంది. పార్టీ విప్ ఉల్లంఘించిన 15 మంది జడ్పీటీసీలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 8 మంది, వరంగల్ లో ఆరుగురు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు సస్పెండయ్యారు. ఉత్తర్వులు నేటి నుంచే అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.