: కాంగ్రెస్ కు ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు: కావూరి


మూడు నెలల కిందటి వరకు కేంద్రమంత్రిగా కాంగ్రెస్ ను వెనకేసుకొచ్చిన కావూరి సాంబశివరావు ప్రస్తుతం అధికార పార్టీ బీజేపీలో ఉండి, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు కర్నూలులో జరిగిన పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కె.హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరితో పాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్ ను విభజించారని ఆరోపించారు. అందుకు ప్రజలు ఆ పార్టీకి సరైన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. అటు వైఎస్సార్సీపీపై కూడా విరుచుకుపడ్డ కావూరి... ఆ పార్టీ ఇక మనుగడ సాగించలేదన్నారు. 2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీలే మిగులుతాయని చెప్పారు.

  • Loading...

More Telugu News