: మోడీ సర్కార్ నిర్ణయాన్ని మరోసారి వ్యతిరేకించిన జయలలిత


సంస్కృత భాషకు ప్రాచుర్యం కల్పించి... దానిని నేర్చుకునేందుకు విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించేందుకు సంస్కృత భాషా వారోత్సవాలను చేపట్టాలని కేంద్ర మానవ వనరుల శాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఆగస్టు 7 నుంచి 13వ తేదీ వరకు సీబీఎస్‌ఈ స్కూళ్లతో పాటు కేంద్రీయ విద్యాలయాల్లో సంస్కృత వారోత్సవాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడులో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా దేశ ప్రధాని నరేంద్రమోడీకి ఆమె లేఖ రాశారు. దక్షిణాదిన ప్రతీ రాష్ట్రానికి ఒక ప్రాంతీయ భాష ఉందని ఆమె అన్నారు. తమిళం ఒక ప్రాచీన భాష అని... తమిళనాడుకు ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపద ఉందని జయలలిత అన్నారు. వేరే భాషలను తమపై రుద్దవద్దని ఆమె కేంద్ర ఫ్రభుత్వాన్ని కోరారు. సంస్కృత భాష వారోత్సవాలకు బదులు ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ భాషా వారోత్సవాలను నిర్వహించాలని జయలలిత కేంద్రానికి సూచించారు.

  • Loading...

More Telugu News