: మెస్సీకి పంచె కట్టారు!


ఎక్కడో దక్షిణ అమెరికా ఖండానికి చెందిన ఫుట్ బాల్ స్టార్ లయొనెల్ మెస్సీకి పంచెకట్టు గురించి తెలుసా..? అస్సలు తెలియదు. సంస్కృతి పరంగా భారత్ కు, మెస్సీ స్వదేశం అర్జెంటీనాకు ఎంతో వ్యత్యాసం ఉంది. అయితే, ఈ బార్సిలోనా స్టార్ ఫార్వర్డ్ పంచెకట్టుతో ఉన్న ఫ్లెక్సీలు, పోస్టర్లు ఇప్పుడు కేరళలో దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాకర్ ను విశేషంగా అభిమానించే మలయాళీలు మెస్సీ మనవాడు కాకపోయినా హీరో లెవల్లో ఆరాధిస్తున్నట్టు అర్థమవుతోంది. అందుకే తమ సంప్రదాయ పంచెను మెస్సీకి కట్టి మురిసిపోతున్నారు. ఈ క్రమంలో కంప్యూటర్ ద్వారా పలు పోస్టర్స్ ను డిజైన్ చేశారు. ఓ బ్యానర్లో పంచె కిందికి విడిచిన మెస్సీ కనిపిస్తాడు. మరో పోస్టర్లో పంచె పైకి ఎగగట్టిన మెస్సీ, మరోదాంట్లో పంచె చెంగును చేతిలో పట్టుకుని విలాసంగా నడుస్తున్న మెస్సీ దర్శనమిస్తాడు. ఇక, అన్నిటికంటే ముఖ్యంగా... వరల్డ్ కప్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన బ్రెజిల్ స్టార్ స్ట్రయికర్ నేమార్ ను మెస్సీ జెర్సీ పట్టుకు లాక్కొస్తున్నట్టుగా మరో బ్యానర్..! గాయానికి చికిత్స కోసం నేమార్ కేరళ రానున్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో మెస్సీ, నేమార్ లతో కూడిన పోస్టర్ రూపొందించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News