: తాగునీటి రిజర్వాయర్ నిర్మాణానికి కృషి చేస్తా: గుంటూరు ఎంపీ జయదేవ్
గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈరోజు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పెదవడ్లపూడి గ్రామంలోకి పాదయాత్ర చేస్తూ వెళ్లి... గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఆత్మకూరు గ్రామంలో రూ. 42 లక్షలతో తాగునీటి రిజర్వాయర్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పెదవడ్లపూడి గ్రామంలో ఇప్పటికే నిర్మించిన తాగునీటి పథకాన్ని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్ చిరంజీవి, వైస్ ఛైర్మన్ బాలాజీ, పెదవడ్లపూడి సర్పంచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.