: పరిణీతి చోప్రాను కడు రమ్యంగా వర్ణించిన అభిమాని
సినీ తారలకు ప్రజల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళనాడులో అయితే హీరోయిన్లకు గుళ్ళూగోపురాలూ కట్టించడం చూశాం. ఆ స్థాయిలో కాకపోయినా ఓ అభిమాని తన ఆరాధ్య హీరోయిన్ పరిణీతి చోప్రా కోసం సాహితీ సేద్యం చేశాడు. ఆమె ముఖం చంద్రబింబం అట. రాత్రివేళ చందమామ ఎలా వెలుగును తెస్తుందో, పరిణీతి కూడా అలాగే తన మోముపై దరహాసానికి కారణమవుతుందంటున్నాడు ఆ ఎమోషనల్ ఫ్యాన్. ఇక, పరిణీతిపై తనకున్న ప్రేమకు కొలమానంగా ఓ వర్షపు చినుకును తీసుకుంటే, రోజంతా ఎంత వర్షం పడుతుందో ఆమెపై తనకు అంత ప్రేమ ఉందని సవాల్ కూడా విసురుతున్నాడు. ఇంతచేసీ ఈ భావకవి వయస్సు పదమూడేళ్ళే. తన బ్లాగులో ఈ ప్రేమ సాహిత్యాన్ని పొందుపరిచిన ఆ టీనేజర్ శ్రమకు తగ్గ ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి. పరిణీతికి కూడా ఈ కవిత ఎంతగానో నచ్చిందట.