: ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె హెచ్చరిక
సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఈ నెల 22, 23 తేదీల్లో జిల్లా డిపోల వద్ద ధర్నా చేపడతామని ఈయూ నేతలు తెలిపారు. కార్మికుల వేతనాల నుంచి జమ చేసిన నగదును ఆర్టీసీ ఇంతవరకు సొసైటీకి చెల్లించలేదని... దాంతో, ఆర్టీసీ రూ.253 కోట్లు సొసైటీకి బకాయిపడిందని కార్మికసంఘం నేతలు తెలిపారు. దీనివల్ల సొసైటీ నుంచి తమ కార్మికులకు నాలుగు నెలలుగా రుణాలు ఇవ్వడంలేదని చెప్పారు. ఇప్పటికే 18వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు.