: బాగా ఎంజాయ్ చేస్తున్నా: భువీ


ఇంగ్లండ్ పిచ్ లపై బౌలింగ్ చేయడాన్ని తాను ఎంతగానో ఆస్వాదిస్తున్నానని టీమిండియా యువ సంచలనం భువనేశ్వర్ కుమార్ చెబుతున్నాడు. రెండో టెస్టుకు అతిథ్యమిస్తున్న లార్డ్స్ లో అయితే ఎంతో ఉత్సాహపూరితమైన భావన కలుగుతోందని పేర్కొన్నాడు. ఆఫ్ స్టంప్ కు ఆవల బౌలింగ్ చేయడంపైనే దృష్టిపెట్టి విజయం సాధించానని భువీ తెలిపాడు. ఇంగ్లండ్ బౌలర్లు ఏ లెంగ్త్ ను ఎంచుకుంటున్నారన్న విషయాన్ని పరిశీలించి, అందుకు అనుగుణంగా తమ బౌలింగ్ ను మార్చుకున్నామని వెల్లడించాడు. లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆటలో భువీ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బతీశాడు.

  • Loading...

More Telugu News