: ఎర్రచందనం అమ్మడం ద్వారా ఏపీ సర్కారుకు 4వేల కోట్ల ఆదాయం!
ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎర్రచందనం అమ్మకం ద్వారా భారీ ఆదాయం సమకూరనుంది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం అమ్మకం ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు దగ్గర ప్రస్తుతం 11 వేల టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి. ఒక్క టన్ను ఎర్రచందనం విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ.50 లక్షల వరకు ఉంది. సగటున ఒక టన్నుకు కనీసం 35 నుంచి 40 లక్షలు వచ్చినా... సునాయాసంగా 4 వేల కోట్లు వరకు సంపాదించవచ్చని ఏపీ సర్కారు అంచనా వేస్తోంది. అయితే ఈ 11 వేల టన్నుల ఎర్రచందనం నిల్వల్లో కేవలం 4 వేల టన్నుల విక్రయానికే కేంద్రం అనుమతి ఇచ్చింది. మరో 7 వేల టన్నుల అమ్మకానికి కేంద్రం అనుమతి రావాల్సి ఉంది.