: బరిలో దిగేందుకు తహతహలాడుతున్న యంగ్ డైనమైట్


భారత క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఎవరన్న ప్రశ్నకు ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో సమాధానమిచ్చిన యువ సంచలనం.. శిఖర్ ధావన్. గాయం నుంచి కోలుకుంటున్న ఈ ఢిల్లీ డైనమైట్ క్రికెట్ బరిలో దిగేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాడు. తన తొలి టెస్టులోనే భారీ సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఆసీస్ తో సిరీస్ సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా, జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్సానంతర సన్నాహకాలతో బిజీగా ఉన్న ధావన్ ఐపీఎల్ ఆడేందుకు అట్టే వేచి చూడలేనంటూ క్రికెట్ పై తన ఆపేక్షను చాటుకున్నాడు.

స్వాతంత్ర్యోద్యమ వీరుడు భగత్ సింగ్ తరహా మీసాలతో సీరియస్ గా కనిపించే ఈ నవతరం ఓపెనర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మెల్ బోర్న్ అమ్మాయిని వివాహం చేసుకున్న ఈ 27 ఏళ్ళ డాషింగ్ బ్యాట్స్ మన్ ఇటీవలే తన కుటుంబంతో గడిపిన అనంతరం ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగివచ్చాడు. గత రెండువారాలుగా ఐపీఎల్ మ్యాచ్ లకు దూరమైన ధావన్.. మరో వారంలో మ్యాచ్ ఆడే అవకాశాలున్నాయని సన్ రైజర్స్ బ్యాటింగ్ కోచ్ టామ్ మూడీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News