: కోహ్లీకి ‘స్పెషల్ పర్మిషన్’పై గుసగుసలు!


భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ ఇచ్చిందని ప్రచారం జరుగుతున్న ‘స్పెషల్ పర్మిషన్’పై సర్వత్ర ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా భారత క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు వెళుతున్న సమయంలో వారి వెంట వారి జీవిత భాగస్వాములు కూడా వెళ్లేందుకు బీసీసీఐ అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అయితే విరాట్, ఇంకా ఓ ఇంటి వాడు కాలేదు కదా. అందుకే స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిందేమోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విషయమేంటంటే, బాలివుడ్ నటి అనుష్క శర్మకు, కోహ్లీకి మధ్య ఏదో బంధం నడుస్తోందని చాలాకాలం నుంచి పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే కదా. 'అందరూ వారి భార్యలతో ఇంగ్లండ్ పర్యటనకు వస్తున్నారు, నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ ను తోడు తీసుకొచ్చుకుంటా'నంటూ కోహ్లీ, బీసీసీఐ వద్ద ప్రతిపాదించాడట. అసలే జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకలా నిలిచే కోహ్లీకి, ఆమాత్రం అవకాశం ఇవ్వకపోతే ఎలాగనుకున్నారో, ఏమో మరి బీసీసీఐ పెద్దలు సరేన్నారట. ఇది ఎంతవరకు నిజమో కాని కోహ్లీ ప్రతిపాదన, ఆపై బీసీసీఐ అనుమతిపై పెద్ద చర్చే నడుస్తోంది.

  • Loading...

More Telugu News