: స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న నల్లకుబేరులపై చర్యలు: జైట్లీ


స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న బడా బాబుల జాబితాను త్వరలోనే తెప్పిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. జాబితా ఇవ్వడానికి తమకు కొన్ని న్యాయపరమైన సమస్యలున్నాయని స్విస్ బ్యాంకులు భారత ప్రభుత్వానికి తెలిపాయని జైట్లీ పేర్కొన్నారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బుదాచుకున్న వారిందరి వివరాలు, ఆధారాలను సేకరిస్తున్నామని జైట్లీ తెలిపారు. నల్లకుబేరుల వివరాలను పొందేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామని జైట్లీ స్పష్టం చేశారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న 700 మంది భారతీయుల వివరాలను ఇప్పటివరకు సేకరించామన్నారు. విదేశాల్లో అక్రమంగా డబ్బు దాచుకున్నవారందరిపైనా... కఠిన చర్యలు తీసుకుంటామని జైట్లీ తెలిపారు.

  • Loading...

More Telugu News