: కుంభమేళాలను మరిపించే విధంగా గోదావరి పుష్కర ఏర్పాట్లు: కేసీఆర్


వచ్చే సంవత్సరం జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చెయ్యాలని ఆయన దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. 2015 జులై 14న ప్రారంభమయ్యే పుష్కరాల గురించి విస్తృతంగా ప్రచారం చెయ్యాలని ఆయన అధికారులను కోరారు. ఉత్తరాదిన జరిగే కుంభమేళాలకు దీటుగా గోదావరి పుష్కరాలను తెలంగాణలో జరపాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 12రోజుల పాటు జరిగే పుష్కరాలకు శృంగేరి, కంచి పీఠాధిపతులను... చిన్నజీయర్ స్వామి లాంటి ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బాసర నుంచి భద్రాచలం వరకు వందకు పైగా స్నానఘట్టాలు నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు. గోదావరి తీరం పొడవునా ఉన్న అన్ని దేవాలయాలలో మరమ్మతులు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

  • Loading...

More Telugu News