: ఫిలిప్పీన్స్ తుపాన్ భారత్ ను తాకుతుందా?
ఫిలిప్పీన్స్ ను కుదిపేసిన రమ్మదాన్ తుపాన్ భారత్ ను తాకే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఫిలిప్పీన్స్ లో తుపాను తాకిడికి 35 మంది మరణించగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. మరో రెండు రోజులు ఇలాగే కొనసాగితే ఈ తుఫాన్ భారత్ లోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని వల్ల భారత్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వారు వెల్లడించారు.