: సికింద్రాబాదు-కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాదు-కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 25వ తేదీ రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాదు-కాకినాడ రైలును ఏర్పాటు చేశారు. అలాగే ఈ నెల 29న రాత్రి 11 గంటలకు కాకినాడ-సికింద్రాబాదు మధ్య రైలును ఏర్పాటు చేశారు. ఇవి నడికుడి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం మీదుగా రాకపోకలు సాగిస్తాయి.