: బద్రీనాథ్ లో ఎడతెరపి లేని వర్షాలు
బద్రీనాథ్ లో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాలకు రోడ్డు తీవ్రంగా దెబ్బతినటంతో, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బద్రీనాథ్ లో 26 మంది తెలుగువారు చిక్కుకుపోయారు. గడచిన మూడు రోజులుగా వారంతా చినజీయర్ ఆశ్రమంలో తలదాచుకున్నారు. రోడ్ల పునరుద్ధరణకు మూడు రోజుల సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. రహదారులను పునరుద్ధరించాకే వాహనాల రాకపోకలకు వీలు కలుగుతుంది.