: గోదావరి పుష్కరాలపై కేసీఆర్ సమీక్ష
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో 2015 జులై 15 నుంచి పుష్కరాలను నిర్వహించాలని నిర్ణయించారు. పుష్కరాల సందర్భంగా సదుపాయాలు, సౌకర్యాలు, భద్రత, నిధుల విడుదల తదితర అంశాలపై చర్చించారు.