: సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై విచారణ జరిపించండి: మోడీని కోరిన కుటుంబసభ్యులు
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం ఇప్పటికీ మిస్టరీ వీడని సంఘటనే. దానిపై విచారణ జరిపించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని తాజాగా కుటుంబసభ్యులు కోరారు. నేతాజీ అదృశ్యంపై కొనసాగుతున్న మిస్టరీని ఛేదించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆయన మాయమైపోవడానికి సంబంధించి అన్ని పత్రాలను మరోసారి పరిశీలించాలని కోరారు. కాగా, త్వరలో ఈ విషయంపై మోడీని కలుస్తానని నేతాజీ మేనల్లుడు చంద్రకుమార్ బోస్ చెప్పారు.