: స్మగ్లర్ గంగిరెడ్డి ఎక్కడున్నాడో చెప్పి చట్టానికి జగన్ సహకరించాలి: ఉమ
రైతుల రుణమాఫీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం కావడంతో వైకాపా అధినేత జగన్ ఉక్రోషంతో ఉడికిపోతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తాను దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను రైతులు, డ్వాక్రా మహిళలకు ఇస్తే చరిత్రలో జగన్ నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఎక్కడ దాచారో చెప్పి చట్టానికి సహకరించాలని జగన్ కు సూచించారు. రుణమాఫీపై తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని... జీతాలు కూడా ఇవ్వలేని ఆర్థిక ఇబ్బంది ఉన్నా రుణమాఫీ చేసి తీరుతామని మరో మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.