: ప్రయాణికులను నిండా ముంచిన ట్రావెల్ ఏజెంట్
విదేశాలకు వెళ్లేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేస్తానంటూ, ఓ ట్రావెల్ ఏజెంట్ లక్షలాది రూపాయలు ముంచి పరారయ్యాడు. హైదరాబాదు ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని కేకేఆర్ టూర్ అండ్ ట్రావెల్స్ లో పలువురు ప్రయాణికులు విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. అయితే, బుక్ అయిన టిక్కెట్లను ట్రావెల్ ఏజెంట్ ప్రయాణికులకు తెలియకుండా రద్దు చేశాడు. లక్షలాది రూపాయలతో తన ఆఫీస్ ను వదలిపెట్టి సదరు ఏజెంట్ పరారయ్యాడు. దీంతో, పలువురు ప్రయాణికులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మొత్తం వంద మంది వరకు బాధితులు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.