: 10 ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు తగిలించారు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 10 ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు తగిలించారు. అదనపు బోగీల వల్ల వారానికి 864 స్లీపర్ సీట్లు, 2,080 జనరల్ సెకండ్ క్లాస్ సీట్లు, 896 ఏసీ సీట్లు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి మచిలీపట్నం-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్, హైదరాబాదు-సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, తిరుపతి-సికింద్రాబాదు పద్మావతి ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.