: ఆదర్శ గ్రామాన్ని సందర్శించిన విదేశీ ప్రతినిధులు
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి ఆదర్శ గ్రామాన్ని విదేశీ ప్రతినిధులు సందర్శించారు. ఏడు దేశాలకు చెందిన 25 మంది ప్రతినిధులకు బాలవికాస సమన్వయకర్త సునీత, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాజమౌళి గ్రామం గురించి అవగాహన కల్పించారు. జిల్లాలోని ఖాజీపేటలో రెండు వారాల పాటు జరిగే కమ్యూనిటీ డ్రివెన్ డెవలప్ మెంట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారత్ కు వచ్చినట్టు వారు వెల్లడించారు. గంగదేవిపల్లిని సందర్శించిన వారిలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మాలవి, ఇటలీ, నైజీరియా, శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందిన ప్రతినిధులున్నారు.