: అవినీతిపరులు ఎంతటివారైనా సరే... వదిలిపెట్టం: టీ మంత్రి ఈటెల
ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి, ప్రజలకు మేలుకలిగేలా చూస్తామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పథకాల అమలులో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించమని... ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పేదలందరికీ మేలు చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలో ఈటెల పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.