: సునీల్ గవాస్కర్ పదవీకాలం ముగిసింది: సుప్రీం
బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడుగా, ఐపీఎల్ ఇన్చార్జిగా కొనసాగుతున్న సునీల్ గవాస్కర్ కు సుప్రీంకోర్టు ఉపశమనం కలిగించింది. ఆయనను ఆ పదవుల నుంచి తప్పిస్తూ, ఇకనుంచి ఆయన ఏ అసైన్ మెంట్ అయినా చేపట్టవచ్చిని తెలిపింది. 2014 ఐపీఎల్ సీజన్ ముగిశాక జూన్ 1తోనే పదవీకాలం ముగియడంతో తన ప్రస్తుత పొజిషన్ పై స్పష్టత ఇవ్వాలని గవాస్కర్ సుప్రీంకు లేఖ రాశారు. ఈ మేరకు పరిశీలించిన సుప్రీం పైవిధంగా నిర్ణయించింది.