: అభిమానుల మధ్య ఇరుక్కుపోయి ఊపిరాడక ఇబ్బంది పడ్డ అల్లు అర్జున్
తిరుపతిలో అభిమానుల తాకిడికి అల్లు అర్జున్ ఇబ్బందిపడ్డాడు. తిరుపతిలో జాయ్ అలుక్కాస్ నగలషాపు ప్రారంభోత్సవానికి ఈ రోజు అల్లు అర్జున్ వెళ్లాడు. ఈ హీరో వస్తున్నాడని ముందే తెలుసుకున్న అభిమానులు, ప్రజలు జాయ్ అలుక్కాస్ షాపుకు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ తో కరచాలనం చెయ్యడానికి అభిమానులు పోటెత్తడంతో అతను జనం మధ్యలో ఇరుక్కుపోయాడు. దాంతో ఓ దశలో అల్లు అర్జున్ కు ఊపిరి ఆడలేదు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు... అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జి చేసి... సురక్షితంగా అతడిని బయటకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా షాపు దగ్గర భారీ తోపులాట జరిగింది. తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి.