: నరేంద్రమోడీని మెచ్చుకున్న బ్రిటీష్ పార్లమెంట్
అంతర్జాతీయంగా వరుస ప్రశంసలు అందుకుంటున్న భారత ప్రధాని మోడీని తాజాగా బ్రిటీష్ పార్లమెంట్ కూడా మెచ్చుకుంది. భారత్ లో పేదరికం తగ్గించేందుకు మోడీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించింది. భారతదేశంలో ఆర్థిక వృద్ధి రేటు పెంచడానికి, మౌలిక వసతుల కల్పనకు మోడీ తీసుకున్న చర్యలను బ్రిటీష్ పార్లమెంట్ ప్రశంసించింది. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో పేదరికం 37 శాతం నుంచి 22 శాతానికి తగ్గిందని... మోడీ హయాంలో ఇది మరింత తగ్గుతుందన్న నమ్మకం తమకు ఉందని బ్రిటీష్ ప్రభుత్వ అంతర్జాతీయ ప్రతినిధి బార్ నెస్ నార్త్ ఓనర్ అన్నారు. భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికే ప్రజలు తనను గెలిపించారన్న విషయం మోడీకి తెలుసని... ఆ దిశలో ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారని ఆమె మోడీని ప్రశంసించారు.