: రాష్ట్రంలో కరవు కోరల్లో 234 మండలాలు
తొమ్మిది జిల్లాలలోని 234 మండలాలలో వర్షాభావ, కరవు పరిస్థితులు ఉన్నాయని కేంద్ర బృందం నిర్ధారించింది. కరవు పరిస్థితులపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో అధికారులతో భేటీ అయింది. కరవు పరిస్థితుల అంచనాలపై అధికారులను సమాచారం అడిగి తెలుసుకుంది. సాయంత్రం ముఖ్యమంత్రితో ఈ బృందం సమావేశం అవుతుంది.