: గూగుల్ బిజినెస్ చీఫ్ అరోరా రాజీనామా
గూగుల్ బిజినెస్ చీఫ్, లారీ పేజ్ ముఖ్య కార్యవర్గంలో ఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అయిన నికేష్ అరోరా రాజీనామా చేశారు. ఇక్కడ్నుంచి జపాన్ కు చెందిన సాప్ట్ బ్యాంక్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ గా వెళ్లనున్నట్లు గూగుల్ ప్లస్ సోషల్ నెట్ వర్క్ తెలిపింది. దాదాపు దశాబ్దం నుంచి అరోరాకు గూగుల్ తో అనుబంధం ఉంది. గూగుల్ సేల్స్ కు నేతృత్వం వహిస్తున్న ఒమిడ్ కొర్డెస్టెనీ తాత్కాలికంగా ఆ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.