: కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం గెల్చుకుంటా: పారుపల్లి కశ్యప్
ఈ నెల 23 నుంచి బ్రిటన్ లోని గ్లాస్గో నగరంలో కామన్ వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ గేమ్స్ లో పురుషుల సింగిల్స్ లో బంగారం పతకం సాధించి తీరుతానని ఏస్ షట్లర్ పారుపల్లి కశ్యప్ ధీమా వ్యక్తం చేశాడు. అదే తన ఏకైక లక్ష్యమని, అటు వరల్డ్ నంబర్ వన్ షట్లర్ లీ చాంగ్ వీ టోర్నమెంట్ నుంచి విరమించుకోవడంతో, రెండో సీడ్ ఆటగాడైన తనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. తప్పకుండా తాను గోల్డ్ మెడల్ సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.