: ప్రభుత్వోద్యోగి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ లాయర్, కానిస్టేబుల్


సమాజంలో శాంతిభద్రతలు, చట్టాన్ని కాపాడాల్సిన ఆ ఇద్దరూ ఓ మహిళపై అఘాత్యానికి పాల్పడ్డారు. అరాచకత్వానికి నిలువెత్తు నమూనాగా నిలిచే ఉత్తరప్రదేశ్ లో జరిగిందీ ఘాతుకం. భడోహి ప్రాంతంలోని పోలీస్ లైన్స్ వద్ద ఓ ప్రభుత్వోద్యోగి భార్యపై లాయర్ జైప్రకాశ్ యాదవ్, కానిస్టేబుల్ రామ్ ఆశిష్ సింగ్ అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కాముక న్యాయవాదిని అరెస్టు చేశారు. కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. ఈ వ్యవహారంలో జ్ఞాన్ పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News