: మలేసియా విమానంలో భారతీయులెవరూ లేరు: పౌరవిమానయాన శాఖ
ఉక్రెయిన్-రష్యా సరిహద్దు ప్రాంతంలో కూలిపోయిన మలేసియా విమానంలో భారతీయులెవరూ లేరని పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. కాగా, ఆ విమానం కూలిపోయిన సమయంలో ఎయిరిండియాకు చెందిన ఓ విమానం ఘటనాస్థలికి సమీపంలోనే ప్రయాణిస్తోందన్న కథనాలను విమానయాన శాఖ కొట్టిపారేసింది. ఎయిరిండియాకు చెందిన ఏ విమానమూ ఆ దరిదాపుల్లో లేదని స్పష్టం చేసింది. నిన్న ఉక్రెయిన్ తిరుగుబాటు దళాలు క్షిపణి సాయంతో మలేసియాకు చెందిన ఎంహెచ్17 విమానాన్ని కూల్చివేయడం తెలిసిందే.