: సూరత్ పేలుళ్ల కేసుల్లో నిర్దోషులుగా 11 మంది
సూరత్ పేలుళ్ల కేసులో పదకొండు మందిని సుప్రీంకోర్టు నిర్దోషులుగా తేల్చింది. 1993లో జనవరి, ఫిబ్రవరిలో జరిగిన ఈ పేలుళ్లలో పాఠశాల విద్యార్థిని మరణించగా, పలువురు గాయాలపాలయ్యారు. ఈ కేసులో టాడా కోర్టు వారికి విధించిన జైలు శిక్షను సుప్రీంకోర్టు కొట్టివేసింది.